Homeటాప్ స్టోరీస్ఇంకా తీయని సినిమాతో వివాదం రాజేస్తున్నాడు

ఇంకా తీయని సినిమాతో వివాదం రాజేస్తున్నాడు

Ramgopal varma mind game on NTR biopicలక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది , అయినప్పటికీ వెన్నుపోటు పాటని ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా విడుదల చేసి వివాదాన్ని రాజేస్తున్నాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ . ఈనెల 21న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో విడుదల అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగిన విషయం తెలిసిందే . అయితే దానికి పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని వెన్నుపోటు అనే పాటని విడుదల చేసాడు వర్మ .

అయితే ఆ ఫోటోలో నేరుగా చంద్రబాబు నాయుడు ఫోటోని వాడటం పెద్ద వివాదానికి దారితీసింది . చంద్రబాబు తో పాటుగా ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళ ఫోటోలను కూడా వాడాడు వర్మ . ఇప్పుడా వెన్నుపోటు పాట సంచలనం సృష్టిస్తోంది . అయితే ఇంకా షూటింగ్ పూర్తికాలేదు కానీ అప్పుడే సినిమా జనవరిలో అనేశాడు వర్మ . దానికి తోడు ఎన్టీఆర్ బయోపిక్ ని దెబ్బకొట్టడానికి ఈ ప్రయత్నం చేసాడు వర్మ . మొత్తానికి వివాదాలతో సావాసం చేస్తున్న వర్మ తాజాగా నందమూరి అభిమానుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు .

- Advertisement -

English Title: Ramgopal varma mind game on NTR biopic

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All