Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ వెన్నుపోటు పాట ని రిలీజ్ చేసిన వర్మ

ఎన్టీఆర్ వెన్నుపోటు పాట ని రిలీజ్ చేసిన వర్మ

Controversy song from lakshmis NTRఈరోజు ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక జరుగుతుండటంతో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలోని వివాదాస్పద పాటని విడుదల చేసాడు , అది కూడా యూట్యూబ్ లో విడుదల చేసాడు హడావుడిగా వర్మ . ఎన్టీఆర్ ని 1995 లో ముఖ్యమంత్రి పీఠం నుండి దించేసిన విషయం తెలిసిందే . చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడని డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడి ఫోటోలను నేరుగా వాడాడు వర్మ .

అంతేకాదు ఒక్క చంద్రబాబు నాయుడు ఫోటోలు మాత్రమే కాకుండా అప్పట్లో ఎన్టీఆర్ దించడానికి సహకరించిన అందరి ఫోటోలను వాడుకున్నాడు వర్మ . వెన్నుపోటు అంటూ కర్కశంగా సాగే పాటు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది . లక్ష్మీపార్వతి కోణంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని రూపొందిస్తున్నాడు వర్మ . ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీ గా జనవరిలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ ని విడుదల చేస్తానని అంటున్నాడు . మరి ఆ సినిమా విషయాన్నీ పక్కన పెడితే వర్మ రిలీజ్ చేసిన వెన్నుపోటు పాట మాత్రం చాలా పెద్ద వివాదాన్ని సృష్టించడం ఖాయం .

- Advertisement -

English Title: Controversy song from lakshmis NTR

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All