Homeటాప్ స్టోరీస్రాంగోపాల్ వర్మ మోసం చేశాడంటున్న షణ్ముగ ప్రియ

రాంగోపాల్ వర్మ మోసం చేశాడంటున్న షణ్ముగ ప్రియ

shanmuga priya files case aganist ramgopal varmaదర్శకులు రాంగోపాల్ వర్మ నన్ను మోసం చేసాడని సంచలన ఆరోపణలు చేస్తోంది షణ్ముగ ప్రియ . రాంగోపాల్ వర్మ మోసం చేయడం ఏంటి ? షణ్ముగ ప్రియ ఎవరు ? అని అనుకుంటున్నారా ? స్మగ్లర్ వీరప్పన్ కర్నాటకతో పాటుగా తమిళనాడు ని కూడా గడగడ లాడించిన విషయం తెలిసిందే . అలాంటి స్మగ్లర్ వీరప్పన్ ఆచూకిని పోలీసులకు అందించి అతడి ఎన్ కౌంటర్ కు కారణమైన వ్యక్తీ ఈ షణ్ముగ ప్రియ . వీరప్పన్ కి సంబందించిన పక్కా సమాచారం ఇస్తే ఆర్ధికంగా అన్నిరకాలుగా సహాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారట కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ వీరప్పన్ ని ఎన్ కౌంటర్ చేసిన తర్వాత నయా పైసా కూడా ఈమెకు ఇవ్వలేదట ! రెండు ప్రభుత్వాలు నన్ను వాడుకొని మోసం చేసాయని బాధ పడుతుంటే రాంగోపాల్ వర్మ కూడా అలాగే మోసం చేసాడని వాపోతోంది షణ్ముగ ప్రియ .

దర్శకులు రాంగోపాల్ వర్మ ” వీరప్పన్ ” కథాంశంతో కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే . ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది . అయితే ఆ సినిమా తీసే ముందు షణ్ముగ ప్రియ ని కలిసి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని మాయమాటలు చెప్పాడట ! దాంతో పూసగుచ్చినట్లు అన్ని విషయాలు చెప్పింది , అయితే ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకుండా కేవలం లక్ష మాత్రమే ఇచ్చారట . ఎన్నిసార్లు అడిగినా వాయిదా వేస్తుండటంతో చేసేది లేక కేసు వేసింది షణ్ముగ ప్రియ . తనకు ప్రాణహాని ఉందని , ఇటు డబ్బులు ఇవ్వకుండా వర్మతో పాటుగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేసాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది షణ్ముగ ప్రియ .

- Advertisement -

English Title: shanmuga priya files case against ram gopal varma

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All