Homeటాప్ స్టోరీస్మాస్టర్ ప్లాన్ వేసిన రాంచరణ్

మాస్టర్ ప్లాన్ వేసిన రాంచరణ్

Ramcharan master plan behind Vinaya vidheya rama and RRR రాంచరణ్ తేజ్ మాస్టర్ ప్లాన్ వేసాడు , అది పక్కాగా వర్కౌట్ అయ్యేది కాబట్టి రిస్క్ లేదని పైగా భారీ ఎత్తున లాభాలు రావడం ఖాయం కాబట్టి మరో ఆలోచన లేకుండా పెట్టుబడులు పెట్టాడట ! ఇంతకీ రాంచరణ్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి ? ఎందులో పెట్టుబడులు పెట్టాడో తెలుసా ……. వినయ విధేయ రామ , ఆర్ ఆర్ ఆర్ చిత్రాల్లో రాంచరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ రెండు చిత్రాలను కూడా డివివి దానయ్య నిర్మిస్తున్నాడు దాంతో తన రెమ్యునరేషన్ తీసుకోకుండా దాన్నే పెట్టుబడిగా పెట్టాడు చరణ్ .

అంటే లాభాలలో వాటాదారుడు అన్నమాట ! వినయ విధేయ రామ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు , ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి జక్కన్న దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే . రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి . దాంతో పెద్ద ఎత్తున బిజినెస్ కావడం ఖాయం అంటే భారీగా లాభాలు రావడం కూడా ఖాయమే ! అందుకే రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసాడు చరణ్ .

- Advertisement -

english Title: Ramcharan master plan behind Vinaya vidheya rama and RRR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All