Homeటాప్ స్టోరీస్వినయ విధేయ రామ టీజర్ టాక్

వినయ విధేయ రామ టీజర్ టాక్

Vinaya vidheya rama teaser talkరాంచరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ టీజర్ ఈరోజు విడుదల అయ్యింది . ఈ సినిమాకు దర్శకులు బోయపాటి శ్రీను కాబట్టి టీజర్ ఇలాగే ఉంటుందని సహజంగానే అనుకుంటారు , అందరూ అనుకున్నట్లుగానే టీజర్ ఉంది ప్రత్యేకత అంటూ ఏమిలేదు . ఊర మాస్ కి నచ్చేలా ఈ సినిమా ఉండబోతోంది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే అనుకున్నారు . కట్ చేస్తే అచ్చం ఊహించినట్లుగానే వినయ విధేయ రామ టీజర్ ఉంది . మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించడం ఖాయం .

అయితే టైటిల్ చాలా సాఫ్ట్ గా ఉంది కానీ టీజర్ మాత్రం మా …….స్ . డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2019 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . సంక్రాంతి అంటే ఇంటిల్లి పాదికి సెలవులు కాబట్టి వీర లెవల్లో వసూళ్లు రావడం ఖాయం . చరణ్ సరసన మహేష్ భామ కియరా అద్వానీ నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు . 49 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మెగా ఫ్యాన్స్ ని విశేషంగా అలరించేలా ఉండటమే !

- Advertisement -

English Title: Vinaya vidheya rama teaser talk

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All