Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్ లో నటించడం లేదంటున్న హీరో

ఆర్ ఆర్ ఆర్ లో నటించడం లేదంటున్న హీరో

Kannada hero Yash denied rumors on RRRఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ కు ఎనలేని క్రేజ్ వచ్చేసింది . బాహుబలి సిరీస్ ల తర్వాత జక్కన్న నుండి వస్తున్న చిత్రం కావడం, ఎన్టీఆర్చరణ్ వంటి మాస్ హీరోలు నటిస్తున్న చిత్రం కావడంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఎనలేని క్రేజ్ వచ్చింది . ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ , చరణ్ ల తర్వాత మరో ముఖ్యమైన పాత్రధారులను అయితే ఎంపిక చేయలేదు కానీ మిగతా పాత్రల్లో రకరకాల నటీనటుల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి . తాజాగా కన్నడ హీరో యష్ పేరు ఆర్ ఆర్ ఆర్ లో వినిపిస్తోంది . అది కూడా విలన్ గా , అయితే ఈ విషయం యష్ చెవిన పడటంతో నేను ఆర్ ఆర్ ఆర్ లో నటించడం లేదని ఒకవేళ జక్కన కోరితే తప్పకుండా నటిస్తానని అంటున్నాడు .

యష్ కన్నడ హీరో , తాజాగా కేజీఎఫ్ చిత్రంలో నటిస్తున్నాడు . ఆర్ ఆర్ ఆర్ గురించి తెలియడంతో ఖండించాడు . అయితే ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని అంటున్నాడు . ఎందుకంటే జక్కన్న సినిమాలో విలన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే . అందుకే ఎంత పేరున్న నటుడైనా జక్కన్న సినిమాలో విలన్ పాత్ర అంటే తెగ ఇష్టపడుతుంటారు .

- Advertisement -

English Title: Kannada hero Yash denied rumors on RRR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All