Homeటాప్ స్టోరీస్మాస్ లుక్ లో రామ్‌చ‌ర‌ణ్‌, బోయపాటి శ్రీనుల `విన‌య విధేయ రామ‌` ఫ‌స్ట్ లుక్

మాస్ లుక్ లో రామ్‌చ‌ర‌ణ్‌, బోయపాటి శ్రీనుల `విన‌య విధేయ రామ‌` ఫ‌స్ట్ లుక్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను చిత్రానికి `విన‌య విధేయ రామ‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత దాన‌య్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు ప్ర‌ధాన తారాణంగా న‌టిస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా

అగ్ర‌ నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ – “క్రేజీ కాంబినేష‌న్ మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే … అనౌన్స్‌మెంట్ రోజు నుండే భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రానికి `విన‌య విధేయ రామ` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశాం. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశాం. ఈ ఫ‌స్ట్‌లుక్ ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. అలాగే ఈ దీపావ‌ళికి మ‌రో కానుక‌గా అందిస్తున్నాం. ఈ న‌వంబ‌ర్ 9న టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నాం. సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. రెండు పాట‌లు మిన‌హా న‌వంబ‌ర్ 10 నాటికి షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి 2019 సంక్రాంతి కానుక‌గా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All