Homeటాప్ స్టోరీస్శ్రీ‌మ‌తి కోసం మెగా హీరో కుక్ అవ‌తారం!

శ్రీ‌మ‌తి కోసం మెగా హీరో కుక్ అవ‌తారం!

శ్రీ‌మ‌తి కోసం మెగా హీరో కుక్ అవ‌తారం!
శ్రీ‌మ‌తి కోసం మెగా హీరో కుక్ అవ‌తారం!

క‌రోనా కార‌ణంగా అంతా ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా దేశాల‌న్నింటినీ క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ణికిస్తోంది. దీంతో ప్ర‌పంచ దేశాన్నీ లాక్‌డౌన్‌ని విధించాయి. దీంతో మ‌న దేశంలోనూ 21 రోజుల పాటు లాక్ డౌన్‌ని విధించారు. దీంతో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ మూసి వేయ‌బ‌డ్డాయి. సినిమా థియేఊట‌ర్స్‌, షాపింగ్ మాల్స్‌.. సినిమా షూటింగ్‌లు అన్నీ ఆగిపోయాయి.

సినిమా షూటింగ్‌లు నిలిచిపోవ‌డంతో నిత్యం బిజీగా వుండే స్టార్స్ లాక్‌డౌన్ కార‌ణంగా ఇళ్ల‌కే ప‌రిమ‌త‌మ‌య్యారు. క్వారెంటైన్ టైమ్‌ని ఎవ‌రికి తోచిన‌ట్టు వారు గ‌డిపేస్తున్నారు. ఒక‌రు స్క్రిప్ట్‌లు రాస్తుంటే కొంత మందేమో వ‌ర్క‌వుట్‌లు చేస్తున్నారు. కొంత మంది హీరోలు త‌మ పిల్ల‌లతో ఎంజాయ్ చేస్తున్నారు. మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్ మాత్రం త‌న స‌తీమ‌ణి కోసం కుక్ అవ‌తారం ఎత్తారు. దీనికి సంబంధించిన ఓ వీడియోని ఉపాస‌న సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

- Advertisement -

ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. రామ్‌చ‌ర‌ణ్ త‌న‌ కోసం డిన్న‌ర్ ప్రిపేర్ చేస్తున్నార‌ని, వంట చేసిన త‌రువాతే వండిన పాత్ర‌ల్ని తానే శుభ్రం చేస్తున్నార‌ని, మీ‌రు కూడా మీ భార్య‌ల‌కు డిన్న‌ర్ ప్రిపేర్ చేయండి అని  ఉపాస‌న ట్వీట్ చేశారు. రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న రిలీజ్ కానుంది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All