
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత రామ్‌చరణ్ మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ ఓ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో రామ్‌చరణ్ కీలక అతిథి పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. `ఆచార్య` పేరుతో రూపొందుతున్న ఈ చిత్ర తదుపరి షూటింగ్ రాజమౌళి అనుమతిపై ఆధారపడి వుంది. `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న రామ్‌చరణ్ దర్శకుడు రాజమౌళి అనుమతి కోసం గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే సోలో హీరోగా రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని ఇద్దరు దర్శకులు గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మహేష్ పక్కన పెట్టడంతో వంశీ పైడిపల్లి మెగా హీరో రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అతనికి మించి `సాహో` దర్శకుడు సుజీత్ ట్రై చేస్తున్నట్టు తెలిసింది. అతనికి యువీ క్రియేషన్స్ కూడా తోడయినట్టు సమాచారం. యూవీ ఎప్పటి నుంచో రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని ట్రైచేస్తున్నారు. అది ఇప్పటికి కుదిరేలా కనిపిస్తోంది. అయితే ఈ ఇద్దరిలో రామ్‌చరణ్ ఎవరికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తాడన్నది మాత్రం వేచి చూడాల్సిందే.