Homeటాప్ స్టోరీస్రజనీకాంత్ రూ. 50 లక్షలు ; విజయ్ సేతుపతి రూ.10 లక్షలు

రజనీకాంత్ రూ. 50 లక్షలు ; విజయ్ సేతుపతి రూ.10 లక్షలు

రజనీకాంత్ రూ. 50 లక్షలు ; విజయ్ సేతుపతి రూ.10 లక్షలు
రజనీకాంత్ రూ. 50 లక్షలు ; విజయ్ సేతుపతి రూ.10 లక్షలు

సినిమాల్లో నటించే నటీనటులు సాంకేతిక నిపుణులు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి కొంతకాలం వరకు సినిమాలు లేకపోయినా, పని లేకపోయినా ఆర్థిక పరిస్థితికి మాత్రం ఏమి లోటు రాదు. కానీ సినిమా ఇండస్ట్రీలో “రెక్కాడితే కానీ డొక్కాడని” ప్రజలు 60 శాతం మంది ఉన్నారు. 24 విభాగాలకు చెందిన  వందలాది వేలాది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా సినిమా ఇండస్ట్రీ పై ఆధారపడి జీవించే  చిరుద్యోగులు,వ్యాపారస్తులు వీళ్ళందరికీ బ్రతుకుదెరువు ఉపాధి కొనసాగాలంటే సినిమాలు జరుగుతూ ఉండాలి. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో సినిమాల అన్ని రకాల పనులు వాయిదా పడ్డాయి. షూటింగులు,  ప్రీ ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్, ఈవెంట్లు అన్ని రకాల కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి.

ఇక ఇలాంటి సందర్భంలోనే తెర మీద ఉండే హీరోలకు నిజజీవితంలో కూడా హీరోలుగా ప్రవర్తించే మనుషులకు తేడా తెలుస్తుంది. కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందిపడుతున్నఅనేకమంది “ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా” సంస్థకు సూపర్ స్టార్ రజినీకాంత్ 50 లక్షల విరాళం ప్రకటించగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ “ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అనే సంస్థ” లో దక్షిణ భారత దేశ వ్యాప్తంగా సుమారు పాతిక వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఇరవై మూడు విభాగాలకు సంబంధించి కార్మికులు ఇందులో సభ్యులు గా ఉన్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ లు లేక సంక్షోభంలో ఉన్నకార్మికులకు ఈ చర్య వల్ల కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All