Homeటాప్ స్టోరీస్కరోనా వైరస్ ను కట్టడి చేసిన తైవాన్ – ఏం చేసిందంటే..!

కరోనా వైరస్ ను కట్టడి చేసిన తైవాన్ – ఏం చేసిందంటే..!

కరోనా వైరస్ ను కట్టడి చేసిన తైవాన్ – ఏం చేసిందంటే..!
కరోనా వైరస్ ను కట్టడి చేసిన తైవాన్ – ఏం చేసిందంటే..!

ఒకవైపు కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలలో ప్రజలు అల్లాడిపోతున్నారు. సైంటిఫిక్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇటలీ, ఇరాన్, చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో మాదిరిగా ఒక్కసారిగా కరోనా వైరస్ మహమ్మారి మనదేశంలో అవుట్ బ్రేక్ అయితే వేలల్లో ప్రాణనష్టం జరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది. కానీ ఒకే ఒక దేశం అసలు కరోనా వైరస్ ను వ్యాప్తికి కారణమైన చైనా దేశం పక్కనే ఉన్నా… కానీ కరోనా వైరస్ తమ దేశంలో అధికంగా వ్యాపించకుండా చర్యలు తీసుకొని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆ దేశం పేరు తైవాన్. ఒక్కసారి తైవాన్ దేశపు పద్ధతులు పాటించి.. మన దేశంలో కూడా అమలు చేసి ఉంటే ఈ రోజు మనం ఎంత బాధ పడాల్సిన పరిస్థితి ఉండేది కాదు.

తైవాన్ జనాభా 2కోట్ల 40 లక్షలు. వాళ్లకు పక్కనే చైనా ఉంది . చైనాలో 81వేల మందికి పైగా కరోనా ఉంటే… తైవాన్ లో కేవలం 47 మందికి మాత్రమే వైరస్ సోకింది. ఇప్పటివరకూ ఒక్కరు మాత్రమే చనిపోయారు. వైరస్ సోకిన వారిలో 40 శాతం మంది రికవరీ అయ్యారు. కారణం… తైవాన్ ప్రభుత్వం ఫాలో అవుతున్న సేఫ్టీ ప్రోటోకాల్స్. 2019 డిసెంబర్ నుంచే తమ దేశానికి వచ్చే ప్రతీ ఒక్కరికీ స్క్రీనింగ్ టెస్టులు జరిపించింది. అప్పటికి ప్రపంచ దేశాలేవీ ఇలా చెయ్యలేదు. అప్పటికి ప్రపంచ దేశాలేవీ అసలు స్క్రీనింగ్ టెస్టులే మొదలుపెట్టలేదు. జనవరి నెలాఖరు నుండీ వుహాన్ నుంచీ విమానాల రాకపోకల్ని రద్దు చేసేసింది. తమ దేశంలోని స్కూళ్లలో 65 లక్షల మాస్కుల్ని, 84000 లీటర్ల హ్యాండ్ శానిటైజర్లను, 25000 థెర్మోమీటర్లను పంచింది.

- Advertisement -

తైవాన్ దేశంలో 99 శాతం ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అది కూడా చాలా తక్కువ ప్రీమియం తో ఉంటుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ ట్రావెల్ హిస్టీరి, ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లోనే రిపోర్ట్ చేసే విధానాన్ని తైవాన్ డెవలప్ చేసింది. ఈ డేటాను నేరుగా తైవాన్ డిసీజ్ కంట్రోల్ సెంటర్లకు ఇచ్చారు. కరోనా బారిన పడ్డ దేశాల నుంచి వచ్చిన వారికి అనారోగ్యం లేకపోయినా సరే… 14 రోజులపాటు వారి ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉంచారు. ఇలా చేయని వారికి, కరోనా లక్షణాల గురించి బయటకు చెప్పని వారికి భారీగా జరిమానాలు విధించారు.

ప్రభుత్వ ముందస్తు సన్నద్ధతకు ప్రజల సహకారం తోడవటంతో కరోనా వైరస్‌ వ్యాప్తిని తైవాన్ సమర్థవంతంగా ఎదుర్కొంది. చైనా కారణంగా తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించడానికి చాలా దేశాలు అంగీకరించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థలో తైవాన్‌‌కు సభ్యత్వం లేదు. కానీ తైవాన్ కరోనాను కట్టడి చేసి తీరు ప్రపంచ దేశాలకు ఆదర్శం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All