Homeటాప్ స్టోరీస్కరోనా వైరస్ ఎఫెక్ట్ – 2 వారాల్లో రూ.1000 కోట్ల నష్టం

కరోనా వైరస్ ఎఫెక్ట్ – 2 వారాల్లో రూ.1000 కోట్ల నష్టం

కరోనా వైరస్ ఎఫెక్ట్ – 2 వారాల్లో రూ.1000 కోట్ల నష్టం
కరోనా వైరస్ ఎఫెక్ట్ – 2 వారాల్లో రూ.1000 కోట్ల నష్టం

భారతదేశంలో కరోనా వైరస్ వల్ల ఇప్పటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమకు వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.ఇప్పటికే ఈ నెల 31వ తేదీ వరకు అన్ని రకాల వ్యాపార మరియు కార్యాలయాలు,ఆఫీసులు స్కూళ్లు,కాలేజీలు అన్నీ మూసివేసిన సందర్భంలో 21వ తేదీ వరకు సినిమాల రిలీజ్ లను కూడా ఆపారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి భారతదేశంలో మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో మరో రెండు వారాల పాటు అన్ని భాషలకు సంబంధించిన సినిమా రిలీజ్ లను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గత రెండు వారాలుగా రిలీజ్ అయిన అన్ని రకాల సినిమాలకు కరోనా వైరస్ ప్రభావం వల్ల కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి.ఇక ఆ సినిమాల శాటిలైట్, డబ్బింగ్ మరియు ఇతర డిజిటల్ మీడియా రైట్స్ కు సంబంధించిన రెవెన్యూ కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. ఇక భారతదేశంలో సినిమా తర్వాత ప్రజలు అందరూ అంతగా ఆదరించే క్రికెట్  ఐపీఎల్ కు కూడా ఏప్రిల్ 15 వరకు వాయిదా పడిన నేపథ్యంలో; తర్వాత వారు భారీ స్థాయిలో ప్రచారం చేసి ఆటల పోటీలు నిర్వహించే అవకాశం ఉంది.

 కాబట్టి భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించిన అతి పెద్ద ఇండస్ట్రీలో అయినా బాలీవుడ్ టాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీ లకు సంబంధించిన పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అనగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు నిర్మాణాంతర కార్యక్రమాలు వెళ్లక నష్టపోతున్నదాఖలాలు ఉన్నాయి. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయిన సినిమాలు ప్రమోషన్ కార్యక్రమాలు కరోనా వైరస్ నేపథ్యంలో ఆగిపోయాయి. ఇక సినిమాల బిజినెస్ కు సంబంధించి కూడా స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లు హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు సినిమాలను తగ్గించి అడుగుతున్నట్లు సమాచారం. ఎందుకంటే కరోనా వైరస్ పూర్తిగా అరికట్టడబడిన నేపథ్యంలో కూడా ప్రజలు మళ్లీ మామూలు స్థితికి ఆలోచన మారి గతంలో మాదిరి భారీ స్థాయిలో సినిమాలను ఆదరించడానికి ఎక్కువ సమయమే పడుతుంది. పైగా అన్ని రకాల సినిమాలు బయట అప్పులు లేదా లోన్లు తీసుకొని షూటింగ్ కు వెళ్తాయి. గనుక ఈ సినిమా రిలీజ్ లలో ఆలస్యం అయిన నేపథ్యంలో ముఖ్యంగా వడ్డీలు భారీ స్థాయిలో సినిమాలకు ఉంటాయి కాబట్టి; సినిమాల బడ్జెట్ లో తడిసి మోపెడు అయ్యే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు వీలైనంతవరకు సినిమా వ్యయం తగ్గించుకొనే దానికి తమ వంతు ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీకి మాత్రం కరోనా వైరస్ వల్ల ఇప్పటికీ కలిగిన నష్టం వెయ్యి కోట్లు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All