Homeగాసిప్స్విజ‌య్ `మాస్ట‌ర్‌` కోసం టాలీవుడ్ హీరో!

విజ‌య్ `మాస్ట‌ర్‌` కోసం టాలీవుడ్ హీరో!

విజ‌య్ `మాస్ట‌ర్‌` కోసం టాలీవుడ్ హీరో!
విజ‌య్ `మాస్ట‌ర్‌` కోసం టాలీవుడ్ హీరో!

విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం `మాస్టర్`. కార్తితో `ఖైదీ` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న లోకేష్ కనకరాజ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. ప్రారంభ ద‌శ నుంచే ఈ సినిమాపై అంచ‌నాలు స్కై హైకి చేరుకున్నాయి. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చెన్నై స‌మీపంలో జ‌రుగుతోంది.

ఇటీవ‌ల ఈ చిత్రం కోసం `కుట్టి స్టోరీ.. ` పాట‌ని విజ‌య్ చేత పాడించాడు అనిరుధ్‌. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ పాట యూట్యూబ్‌తో పాటు సోష‌ల్ మీడియాలో మ‌రో `కొల వెరిడీ.. త‌ర‌హాలో వైర‌ల్‌గా మారింది. ఇక ఇదే పాట‌ని తెలుగులోనూ పాడించాల‌ని అనిరుధ్ భావిస్తున్నాడు. అయితే అది విజ‌య్‌తో కాదు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో. యంగ్ టైగ‌ర‌ట్ ఎన్టీఆర్ అప్పుడ‌ప్పుడు పాట‌లు కూడా పాడుతున్న విష‌యం తెలిసిందే. క‌న్న‌డ‌లో శివ‌రాజ్‌కుమార్ కోసం పాట పాడి ఆక‌ట్టుకున్నాడు కూడా.

- Advertisement -

ఎన్టీఆర్ న‌టించిన `బాద్‌షా` కోసం త‌మిళ హీరో శింబు ఓ పాట పాడిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌డు త‌మిళ హీరో కోసం ఎన్టీఆర్ పాట‌పాడుతుండ‌టంతో ఈ సినిమాపై తెలుగులోనూ క్రేజ్ పెరుగుతోంది. తెలుగులో విజ‌య్‌కి ఇంత‌కు ముందు మార్కెట్ లేదు. కానీ మెర్స‌ల్ ( అదిరింది) నుంచి మార్కెట్ స్థాయి మారింది. విజ‌య్ సినిమా వ‌స్తోందంటే డిస్ట్రిబ్యూట‌ర్స్ ఆస‌క్తి చూపిస్తున్నారు. `మాస్ట‌ర్‌` కోసం ఎన్టీఆర్ పాట పాడ‌బోతుండ‌టంతో ఈ సినిమా మార్కెట్ స్థాయి మ‌రింత పెరిగే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All