Homeటాప్ స్టోరీస్హాలీవుడ్ సూపర్ హీరోలను వదలని కరోనా వైరస్

హాలీవుడ్ సూపర్ హీరోలను వదలని కరోనా వైరస్

హాలీవుడ్ సూపర్ హీరోలను వదలని కరోనా వైరస్
హాలీవుడ్ సూపర్ హీరోలను వదలని కరోనా వైరస్

“చట్టం ముందు అందరూ సమానమే..” అని ఒక సామెత ఉంది. కానీ ఇప్పుడు వైరస్ ముందు అందరూ సమానమే అని నిరూపణ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న కరోనా వైరస్ ఇప్పటివరకు ఎనిమిది వేల మందిని పొట్టన పెట్టుకుంది. కరోనా బాధితులలో సామాన్య ప్రజల దగ్గర నుంచి కోట్లకు పడగలెత్తిన ధనవంతుల వరకు అందరూ ఉన్నారు. ఇక కరోనా వైరస్ హాలీవుడ్ సినిమా స్టార్లకు కూడా సోకింది.

ఇప్పటికే అవెంజర్స్ సీరీస్ లో ఇన్ఫినిటీ వార్ సినిమాలో నటించిన నటుడు  ఇడ్రీస్ ఎల్బా తాను కరోనా వ్యాధి బారిన పడినట్లుగా ట్విట్టర్ లో వెల్లడించారు. అదే విధంగా “హ్యాపీ డెత్ డే” సినిమాలో నటించిన నటీమణి రాచెల్ మ్యాథ్యూస్ కూడా తనకు కరోనా వైరస్ సోకినట్లు గా ప్రకటించారు. ఇక డిజిటల్ ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలను ఆకట్టుకుంటున్న”గేమ్ ఆఫ్ థ్రోన్స్” సిరీస్ లో క్రిస్తోఫర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు.

- Advertisement -

 ఇక హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు టామ్ హ్యంక్స్ మరియు అతని భార్య రీటా ఇద్దరు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ వార్డు లో ఉంటున్నారు. తాజాగా టామ్ హాంక్స్ పరిస్థితి కొంచెం మెరుగుపడటంతో ఆయన బయటికి వచ్చారు, కానీ ఆయన భార్య ఇంకా  ఐసోలేషన్ వార్డ్ లోనే ఉన్నారు. అయితే భారతదేశంలో సినిమా తారలకు సంబంధించి ఎవరికీ ఇంకా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కాలేదు.

తాము నటించే సినిమాలలో సూపర్ హీరో పాత్రలు ధరిస్తూ ప్రపంచాన్ని మరియు ప్రజలను కాపాడే ఈ సూపర్ హీరో పాత్రలు పోషించే నటులు అందరూ.. తమ నిజ జీవితంలో వ్యక్తిగతంగా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది.! అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All