Homeటాప్ స్టోరీస్“భయపడకండి.. పోరాడదాం..!” కరోనా వైరస్ పై “మెగాస్టార్”

“భయపడకండి.. పోరాడదాం..!” కరోనా వైరస్ పై “మెగాస్టార్”

“భయపడకండి.. పోరాడదాం..!” కరోనా వైరస్ పై “మెగాస్టార్”
“భయపడకండి.. పోరాడదాం..!” కరోనా వైరస్ పై “మెగాస్టార్”

దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రజలకు తన సినిమాల ద్వారా ఎంతో మంచిని మానవత్వాన్ని, నిజాయితీని అంతకుమించి మంచి సందేశాన్ని అందించిన మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు కరోనా వైరస్ విషయంలో స్పందించారు. మొట్ట మొదటి నుంచి సినిమాలు చేయడంతో పాటు సామాజిక అంశాలపై తనదైన శైలిలో సరైన అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దిన మెగాస్టార్ చిరంజీవి గతంలో కూడా రక్త దానం, నేత్రదానం వంటి వాటికి సంబంధించిన ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. గత కొంతకాలం క్రితం ప్రపంచానికి పెను సవాల్ మారిన ఎయిడ్స్ విషయంలో కూడా హెచ్ఐవి వైరస్ గురించి సినిమా ఇండస్ట్రీ తరఫున మెగాస్టార్ చిరంజీవి పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఇక ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ ను సమర్థవంతంగా అందరం కలిసి ఎదుర్కొందామని; ఎవరూ భయపడవద్దని; కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,ఆరోగ్యశాఖ,డాక్టర్లు,నిపుణులు,శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు మనకు అందిస్తున్న సూచనలను పాటించి వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు  సామాజికంగా కొంతకాలం అన్ని రకాల కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఈ మహమ్మారిని తరిమికొడదాం..! అని మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా కోట్లాది మంది ప్రజలకు,తన అభిమానులకు పిలుపునిచ్చారు.

- Advertisement -

 ముఖ్యంగా ప్రజలు “తమకు ఏదో అయిపోతోంది” అన్న భయం; కానీ లేకపోతే “తమకు ఏది కాదు లే..!” అని నిర్లక్ష్యంగా కూడా వహించవద్దని…  మనం నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుతం ప్రమాదకరంగా ఉన్న ఈ వైరస్ మహమ్మారిగా మారి లక్షలాది మందిని బలితీసుకుంటుందని మెగాస్టార్ చిరంజీవి జాగ్రత్తలు తెలియజేశారు.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All