Homeటాప్ స్టోరీస్హాలీవుడ్ నటుడికి కరోనా భూతం

హాలీవుడ్ నటుడికి కరోనా భూతం

హాలీవుడ్ నటుడికి కరోనా భూతం
హాలీవుడ్ నటుడికి కరోనా భూతం

కరోనా.. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న పేరు. భారతదేశంలో దీని ఎఫెక్ట్ తక్కువగానే ఉంది కానీ ప్రస్తుతం కరోనా దాదాపు 100 దేశాలకు పాకిపోయింది. ఈ వైరస్ సోకిన ప్రజలు త్వరగానే కోలుకుంటున్నా కానీ దీనిపట్ల ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలు ఉన్నాయి. ఇప్పటికే విదేశాలకు రాకపోకలు ప్రతీ దేశంలోనూ తగ్గిపోయాయి. యాత్రికులు అన్న వాళ్ళే కనిపించట్లేదు. ఎవరైనా విదేశాల నుండి వస్తుంటే వారిని 14 రోజుల పాటు జాగ్రత్తగా ఉంచుతున్నారు. మళ్ళీ ఒక టెస్ట్ చేసి అప్పుడే ప్రజల్లోకి వెళ్లే అవకాశమిస్తున్నారు. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా కానీ కరోనా భూతం ఒకరి నుండి ఒకరికి పాకుతూనే ఉంది. రోజురోజుకీ ఈ వైరస్ సృష్టించే భయం ఎక్కువవుతోంది. ఇప్పటివరకూ సాధారణ ప్రేక్షకులకే వైరస్ వచ్చినట్లు అనుకున్నాం కానీ ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు.

ఇప్పటికే యూకే ఆరోగ్య శాఖా మంత్రికి ఈ వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ నటుడే వెల్లడించాడు. వివరాల్లోకి వెళితే.. కాస్ట్ అవే, కెప్టెన్ ఫిలిప్స్, క్యాచ్ మీ ఇఫ్ యు కెన్ వంటి చిత్రాలతో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న టామ్ హాంక్స్ తన సతీమణి రీటా విల్సన్ తో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ వార్నర్ బ్రదర్స్ నిర్మించబోయే చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉండగా గత కొద్ది రోజుల నుండి జ్వరం, ఒళ్ళు నొప్పులు, దగ్గు వంటి లక్షణాలు ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారట. ఫలితాల్లో పాజిటివ్ అని రావడంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు నటుడు తెలిపాడు. మీతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటాను అంటూ సమాచారాన్ని ముగించాడు టామ్ హాంక్స్.

- Advertisement -

కరోనా వైరస్ వల్ల పలు బిజినెస్ లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఎయిర్ లైన్స్ ను ఈ వైరస్ కుదిపేస్తోంది. అలాగే సినిమాలకు కూడా గట్టి దెబ్బే తగిలింది.

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All