HomeVideosకరోనా వైరస్ ని తయారు చేసింది మనుషులేనా.?

కరోనా వైరస్ ని తయారు చేసింది మనుషులేనా.?

YouTube video

ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న విషయం కరోనా వైరస్. ఇప్పటికే ఆసియా లోని పలుదేశాల్లో కరోనా వైరస్ ప్రభావం వల్ల చాలా కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు ఇండియాలో, అందులోనూ హైదరాబాద్ లో కూడా కరోనా వైరస్ కేసులు నమోదు కావడం ప్రజలను తీవ్రంగా భయపెడుతోంది. ఈ వ్యాధికి ఇప్పటివరకూ మందు కనిపెట్టలేదు ప్రస్తుత ఆధునిక ప్రపంచం.

- Advertisement -

కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. చైనాలో ఉండే క్రైట్, కోబ్రా అనే కూడా విషపూరితమైన పాములు కరవడం వలన లేదంటే, వాటిని తినడం వలన వైరస్ వ్యాప్తి చెంది ఉంటుంది అని అక్కడ అభిప్రాయపడుతున్నారు.చైనా లో ఉన్న వూహాన్‌లోని సిఫుడ్  మార్కెట్‌ ఈ వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానంగా భావిస్తున్నారు. 2002- 2003 మధ్య కరోనా వైరస్ లాంటి రకమే అయిన సార్స్ వైరస్ ప్రపంచ దేశాలకూ వ్యాపించింది.

మన దేశంలో కేరళలో ఏడుగురికి, హైదరాబాద్‌లో నలుగురికి ఈ వ్యాధి సోకి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మన దేశంలో ఈ వ్యాధి ఎవరికీ సోకలేదని చెబుతున్నా, ఇది వైరస్ కాబట్టి… గాలి ద్వారా ఒకరి నుంచీ మరొకరికి వచ్చే అవకాశం ఉంది. చైనాలో అంతర్జాతీయ యూనివర్సీటీలలో వందలాది మంది భారతీయ విద్యార్థులున్నారు.

ఈ వైరస్ నేపథ్యంలో భారత్ సహా ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌, హాంగ్‌కాంగ్, అమెరికా వంటి దేశాల అంతర్జాతీయ విమానాశ్రయాల్లో చైనా నుంచి వచ్చే ప్రయాణికుల్ని క్షుణ్ణంగా థర్మోస్ స్కాన్ చేస్తున్నారు.ఈ వైరస్ సోకిన వారికి ముందుగా జలుబు వస్తుంది. ఆపై జ్వరం, దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆపై చికిత్స అందకపోతే తీవ్రమైన న్యుమోనియాకు దారితీయడం, కిడ్నీ వంటి కీలక అవయవాలు విఫలమై ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది.

చలికాలంలో ఈ వైరస్ తీవ్రత, వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇది సోకిన వాళ్లు తుమ్మినా, దగ్గినా వారి ద్వారా ఈ వైరస్ ఇతరుల శ్వాసకోశ నాళంలోకి ప్రవేశించడం ద్వారా వ్యాప్తి చెందుతోంది.ఈ వైరస్ పెంపుడు జంతువులతో పాటు, ప్రధానంగా పాముల నుంచి సంక్రమించినట్లు జర్నల్ ఆఫ్ మెడికల్ వైరాలజీ ప్రకటించింది. ఈ వ్యాధికి చికిత్స కానీ, అడ్డుకోగలిగిన వ్యాక్సీన్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో లేదు.

ఇది సోకకుండా ఉండాలంటే, అపరిచితులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకరాదు. నిత్యం మాస్కులు ధరించాలి. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండకూడదు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది.ఎప్పటికప్పుడు చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. ముఖ్యంగా చలి వాతావరణంలో ఉండకూడదు. పెంపుడు జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి.

ప్రస్తుతం ప్రపంచంలో గత ఇరవై ఏళ్లుగా ఆంత్రాక్స్, సార్స్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, ఎబోలా, జికా, నిఫా, ఇప్పుడు కరోనా ఇలా ఎన్నో రకాల వైరస్ లు బయటకు వస్తున్నాయి. వాటిని ఉపయోగించుకుని జరిగే పనులు జరిగిపోతున్నాయి. కానీ మామూలు మనుషులకు అర్ధం కాని ఈ వికృత క్రీడలో బలవుతున్నది మాత్రం సామాన్య ప్రజలే. కొంతమంది స్వార్ధపరులు అధికారం, ఆధిపత్యం, అహంకారం కోసం జరిగే యుద్ధాలు గతంలో కోట్లమంది మనుషులు,ఆయుధాలు, శ్రమతో జరిగితే ఇప్పుడు గుప్పెడు క్రిములను జనాల్లో విసిరేసి, వాళ్ళు చస్తూ ఉంటే, ఆ భయాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారు.

ఇప్పుడు ఇంత సీరియస్ అయిన ఈ వైరస్ గతంలో కూడా ఉండేదా.?

ఎందుకు ఈ వైరస్ కు ఇప్పటివరకూ మందు కనిపెట్టలేదు.?

ప్రపంచంలో ఎందుకు కొన్ని దేశాల్లోనే ఈ వైరస్ స్ప్రెడ్ అవుతోంది.?

అసలు ఈ వైరస్ నిజంగా నేచర్ నుండి వచ్చిందా.?

లేక కొంతమంది స్వార్ధపరులు వారి శత్రువులను టార్గెట్ చేసుకుని ప్రయోగిస్తున్నారా.? అనే ప్రశ్నలు ప్రజలందరిలో ఉన్నాయి.

Is CoronaVirus was man-made.?
కరోనా వైరస్ ని తయారు చేసింది మనుషులేనా.?
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All