Homeటాప్ స్టోరీస్రాధే శ్యామ్: మెస్మరైజ్ చేయనున్న సిద్ శ్రీరామ్

రాధే శ్యామ్: మెస్మరైజ్ చేయనున్న సిద్ శ్రీరామ్

రాధే శ్యామ్: మెస్మరైజ్ చేయనున్న సిద్ శ్రీరామ్
రాధే శ్యామ్: మెస్మరైజ్ చేయనున్న సిద్ శ్రీరామ్

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ విడుదలకు గట్టిగా 45 రోజులు కూడా లేవు కానీ ఇంకా ప్రమోషన్స్ ఏ మాత్రం ఊపందుకోలేదు. ఫ్యాన్స్ అందరూ గోల గోల పెడితే మొదటి సాంగ్ ఈ రాతలేను విడుదల చేసారు. దానికి కూడా ఎంత జాప్యం జరిగిందో మనం చూసాం. హిందీ వెర్షన్ సాంగ్ కూడా విడుదల కాలేదు. ఆ సాంగ్ విడుదలయ్యాక మళ్ళీ టీమ్ నుండి ఎలాంటి సందడి లేదు.

మరోసారి ఫ్యాన్స్ నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో సెకండ్ సాంగ్ ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే హిందీ వెర్షన్ సాంగ్స్ కూడా త్వరలోనే విడుదలవుతాయి. సౌత్ వెర్షన్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. తాజా సమాచారం ప్రకారం రాధే శ్యామ్ లో విడుదలయ్యే సెకండ్ సాంగ్ కు సిద్ శ్రీరామ్ గానం అందించాడు. సిద్ శ్రీరామ్ పాటలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

- Advertisement -

రాధే శ్యామ్ లో కూడా సిద్ మ్యాజిక్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం జనవరి 14న విడుదలవుతోంది.

ఇవి కూడా చదవండి:

సంక్రాంతి రేసులోకి దూసుకొచ్చిన రాధే శ్యామ్

ప్రభాస్ మొదటి ప్రిఫరెన్స్ ఆ సినిమాకే!!

ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ సాంగ్ ఈ రాతలే టాక్..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All