
ఎస్ ఎస్ థమన్ ప్రస్తుతం ఎంతటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. వరసగా టాప్ సినిమాలతో థమన్ టాప్ రేంజ్ కు చేరుకున్నాడు. ప్రస్తుతం తీరిక లేకుండా వరసగా సినిమాలు చేస్తున్నాడు. దాదాపు అందరు స్టార్ హీరోలతో థమన్ పనిచేసాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసాడు. ఇప్పుడు చిరంజీవితో కూడా వర్క్ చేస్తున్నాడు. అఖండ, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ వంటి సినిమాలతో థమన్ ఏ స్థాయిలో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు.
అయితే అందరితో పనిచేసిన థమన్ ఒక్క ప్రభాస్ తో మాత్రం సినిమా చేయలేదు. సాహో చిత్రానికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. నిజానికి సాహో ఇంట్రడక్షన్ టీజర్ కు థమన్ సంగీతం అందించాడు. అందరి ప్రశంసలు అందుకున్నాడు కూడా. కానీ చివరికి థమన్ నుండి ఆ ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో థమన్ మాట్లాడుతూ తాను ప్రభాస్ మరో సినిమా అవకాశాన్ని కూడా వదులుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రభాస్ నటించిన రెబెల్ సినిమాకు మొదట థమన్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారు. అయితే తనకు సరైన ఫ్రీడమ్ దర్శకుడి నుండి అందలేదని అందుకే ఆ చిత్రం నుండి వాకౌట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు థమన్.
ఇవి కూడా చదవండి:
శివ కార్తికేయన్ సినిమాకు సంగీతం అందించనున్న థమన్?
ఎవరు మీలో కోటీశ్వరులు దీపావళి స్పెషల్ ఎపిసోడ్: డిఎస్పీ, థమన్ ల హంగామా
భీమ్లా నాయక్ అంత ఇష్టం లిరికల్: థమన్ ఖాతాలో మరో చార్ట్ బస్టర్