
రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్ షూటింగ్ ఇటీవలే పూర్తైన విషయం తెల్సిందే. 2018లో మొదలైన రాధే శ్యామ్ షూటింగ్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీనికి కరోనా వైరస్ వల్ల కూడా ఇబ్బంది ఎదురైంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ రాధే శ్యామ్ విషయంలో కొంత అసహనానికి గురయ్యారు.
వీటన్నిటికీ తెర దించుతూ రాధే శ్యామ్ నుండి అప్డేట్ వచ్చింది. రాధే శ్యామ్ ను మొదట జులై 30న విడుదల చేయాలనుకున్నారు మొదట. అది కుదరలేదు కాబట్టి అదే రోజున ఇప్పుడు అప్డేట్ వచ్చింది. రాధే శ్యామ్ ను సంక్రాంతి రేసులోకి తీసుకొచ్చారు. జనవరి 14, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా తెలియజేసారు.
పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.
Directed by @director_radhaa
Presented by @UVKrishnamRaju garu
Produced by @UV_Creations @TSeries #BhushanKumar with #Vamshi #Pramod & @PraseedhaU under @AAFilmsIndia @GopiKrishnaMvs pic.twitter.com/hiOj0zzE8K— Radhe Shyam (@RadheShyamFilm) July 30, 2021