Homeటాప్ స్టోరీస్ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ సాంగ్ ఈ రాతలే టాక్..!

ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ సాంగ్ ఈ రాతలే టాక్..!

Prabhas Radheshyam First Song Ee Rathale Released

యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న రాధే శ్యామ్ ఫస్ట్ సాంగ్ మొత్తానికి రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రభాస్, పూజా హెగ్దే జంటగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న రాధే శ్యామ్ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా సాంగ్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. వెయిటింగ్ తట్టుకోలేని కొందరు ఫ్యాన్స్ యువి క్రియేషన్స్ మీద ఎటాక్ కు దిగిన విషయం తెలిసిందే.

- Advertisement -

అంతేకాదు సోమవారం సాయంత్రం 5 గంటలకు రావాల్సిన సాంగ్ రిలీజ్ కాకపోయే సరికి మరోసారి యువి బ్యానర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాధే శ్యామ్ సాంగ్ 5 గంటలకు రిలీజ్ చేయలేదు. ఫైనల్ గా రాధే శ్యాం నుండి ఫస్ట్ సాంగ్ ఈ రాతలే రిలీజైంది. ఈ సాంగ్ లిరిక్స్, ట్యూన్ అద్భుతం అనిపించడమే కాకుండా విజ్య్వల్స్ కూడా చాలా బాగున్నాయి.

ప్రస్తుతానికి ఈ పాట కోసం గ్రాఫిక్స్ వాడినా ఈ గ్రాఫిక్స్ ను మించి సినిమాలో పాట ఉంటుందని చెప్పకనే చెప్పాడు. మొత్తానికి అంచనాలకు తగినట్టుగానే ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా వస్తుందని అర్ధమవుతుంది. 2022 జనవరి 14న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నేషనల్ వైడ్ గా మరోసారి ప్రభాస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All