Homeన్యూస్విడుదల విషయంలో మార్పే లేదంటున్న ప్రభాస్

విడుదల విషయంలో మార్పే లేదంటున్న ప్రభాస్

విడుదల విషయంలో మార్పే లేదంటున్న ప్రభాస్
విడుదల విషయంలో మార్పే లేదంటున్న ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ సాహో షూటింగ్ సమయంలోనే మొదలుపెట్టిన చిత్రం రాధే శ్యామ్. ఇది ఒక పీరియాడిక్ ఫిక్షనల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. 1960ల కాలంలో యూరోప్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడ్డ ప్రేమకథ ఇది. 2018లోనే ఈ చిత్ర షూటింగ్ మొదలైనా వాయిదాల మీద వాయిదాలు పడుతూ మొత్తానికి షూటింగ్ పూర్తయింది. కోవిద్ కూడా షూటింగ్ లో జాప్యం జరగడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

రాధే శ్యామ్ ను చివరికి జనవరి 14, 2022న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే గత కొద్ది రోజుల నుండి విడుదల తేదీల విషయంలో మరికొంత కన్ఫ్యూజన్ నెలకొంది. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ రేసు నుండి తప్పుకుంది. ఈ చిత్రం దసరాకు రావట్లేదని నిర్ణయించారు. అలాగే సంక్రాంతి 2022కు రానుందని వార్తలు వచ్చాయి.

- Advertisement -

ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా సంక్రాంతికి వస్తుంటే టాలీవుడ్ లో భారీ చిత్రాలైనా కానీ అప్పటికే విడుదల తేదీలను ప్రకటించిన మూడు చిత్రాల్లో కనీసం రెండిటికి స్పేస్ ఉండదు. మిగిలిన వాటి సంగతేమో కానీ రాధే శ్యామ్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఎవరు ఎప్పుడు వచ్చినా రాకపోయినా జనవరి 14కి తమ చిత్రం వస్తుందని రాధే శ్యామ్ నిర్మాతలు ప్రకటించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All