
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ పీరియాడిక్ డ్రామా రాధే శ్యామ్. ఈ సినిమా గత మూడేళ్ళుగా షూటింగ్ దశలోనే ఉంది. రీసెంట్ గా రాధే శ్యామ్ విషయంలో కొన్ని రూమర్స్ వచ్చాయి. ప్రభాస్, హీరోయిన్ పూజ హెగ్డే మధ్య విభేదాలు వచ్చాయని అందుకే ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ను విడిగా చిత్రీకరించారని, ప్రభాస్ బాడీ డబుల్ ను ఉపయోగించి పూజ హెగ్డే మెయిన్ సీన్స్ ను చిత్రీకరించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ న్యూస్ ముదరకముందే రాధే శ్యామ్ నిర్మాతలు రూమర్స్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్, పూజ హెగ్డే మధ్య విభేదాలు వచ్చిన మాటలో అర్ధమే లేదని, ఇక పూజ హెగ్డే సమయానికి సెట్స్ కు రాలేదు అన్నది కూడా అబద్దమని చెప్పారు. పూజ హెగ్డే సమయానికే సెట్స్ కు వచ్చేదని, ఆమెతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.
రాధే శ్యామ్ ను రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేసాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాధే శ్యామ్ ను సంక్రాంతి 2022లో విడుదల చేయనున్నారు.