Homeన్యూస్ప్రభాస్ ఆది పురుష్ విడుదలలో మార్పుల్లేవు

ప్రభాస్ ఆది పురుష్ విడుదలలో మార్పుల్లేవు

ప్రభాస్ ఆది పురుష్ విడుదలలో మార్పుల్లేవు
ప్రభాస్ ఆది పురుష్ విడుదలలో మార్పుల్లేవు

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మల్టీపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. అందులో రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఆది పురుష్ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాను 11 ఆగస్ట్ 2022న విడుదల చేయనున్నట్లు గతేడాదే ప్రకటించారు. మధ్యలో కరోనా కారణంగా కొంత ఎఫెక్ట్ అవ్వడంతో సినిమా విడుదలలో ఏమైనా జాప్యం ఉంటుందేమోనని అందరూ అనుకున్నారు.

అయితే మహారాష్ట్రలో తిరిగి థియేటర్స్ తెరుచుకుంటుండడంతో బాలీవుడ్ ప్రముఖ సినిమాలు అన్నీ విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. మొత్తంగా ఇప్పటికే దాదాపు 16 హిందీ సినిమాలు విడుదల తేదీలు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఆది పురుష్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసారు. ముందుగా అనుకున్న ఆగస్ట్ 11, 2022నే ఈ భారీ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పుడు అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న రక్షా బంధన్ చిత్రంతో డైరెక్ట్ క్లాష్ అవుతోంది. అదే రోజున రక్షా బంధన్ విడుదల తేదీని ప్రకటించారు.

- Advertisement -

ఓం రౌత్ డైరెక్ట్ చేస్తోన్న ఆది పురుష్ లో సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్నాడు. కృతి సనన్ సీతగా నటిస్తోన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All