HomeVideosపుష్పక విమానం ట్రైలర్: ఆసక్తికర కాన్సెప్ట్ తో నవ్వుల పూవులు

పుష్పక విమానం ట్రైలర్: ఆసక్తికర కాన్సెప్ట్ తో నవ్వుల పూవులు

పుష్పక విమానం ట్రైలర్: ఆసక్తికర కాన్సెప్ట్ తో నవ్వుల పూవులు
పుష్పక విమానం ట్రైలర్: ఆసక్తికర కాన్సెప్ట్ తో నవ్వుల పూవులు

స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు కూడా హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోన్న విషయం తెల్సిందే. ఆనంద్ దేవరకొండ దొరసాని చిత్రంతో హీరోగా డెబ్యూ చేసినా తన రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఈ చిత్రం ఓటిటిలో విడుదలవ్వగా సూపర్బ్ రెస్పాన్స్ ను సంపాదించుకుంది.

ఇక ఇప్పుడు ఆనంద్ దేవరకొండ తన మూడో చిత్రంతో ప్రేక్షకుల ముందు రానున్నాడు. ఆనంద్ కెరీర్ లో మూడో సినిమా పుష్పక విమానం ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కూడా సింపుల్ గా ఫన్ జెనెరేట్ చేసే విధంగానే ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేసాడు.

- Advertisement -

పుష్పక విమానంలో ఆనంద్, గవర్నమెంట్ టీచర్ పాత్రలో కనిపిస్తాడు. కొత్తగా పెళ్లి చేసుకుని సీక్రెట్ గా ఇంట్లో పనులు చేసుకుంటూ తన భార్య చేసిందని కలర్ ఇచ్చే భర్తగా ఆనంద్ పాత్ర ఉంటుంది. ఎందుకు అలా సీక్రెట్ గా అంటే పెళ్లి అయి 8 రోజులు బానే ఉన్న తన భార్య వేరే ఎవరితోనో లేచిపోయిందని చెప్తాడు. సునీల్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా కనిపిస్తున్నాడు. మొత్తంగా ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గా అనిపిస్తోంది.

కొత్త దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. నవంబర్ 12న ఈ సినిమా విడుదల కానుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All