Homeటాప్ స్టోరీస్పుష్పక విమానం రివ్యూ

పుష్పక విమానం రివ్యూ

పుష్పక విమానం రివ్యూ
పుష్పక విమానం రివ్యూ

ఆనంద్ దేవరకొండ, గీత్ సైని లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం పుష్పక విమానం. ఈ చిత్రం మొత్తానికి థియేటర్లలో ఈరోజు విడుదలైంది. ఇక ఈ చిత్రం  ఎలా ఉందో చూద్దాం.

కథ:
సుందర్ (ఆనంద్ దేవరకొండ) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేస్తోన్న మిడిల్ క్లాస్ కుర్రాడు. మీనాక్షితో తన పెళ్లి జరుగుతుంది. అయితే హనీమూన్ కు సిద్ధమవుతోన్న సమయంలో తన భార్య లేచిపోయిందని తెలుసుకుంటాడు. మీనాక్షి ఎందుకు లేచిపోయింది? తర్వాత ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు చిత్రం చూసి తెలుసుకోవాలి.

- Advertisement -

పెర్ఫార్మన్స్:
సుందర్ గా ఆనంద్ దేవరకొండ బెస్ట్ ఔట్పుట్ ఇచ్చాడని చెప్పాలి. మీనాక్షి పాత్రలో గీత్ సైని చాలా అందంగా ఉంది. తన పాత్రకు న్యాయం చేసింది. తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఫేక్ భార్యగా శాన్వి కూడా ఆకట్టుకుంది. ఆమె కామెడీ బాగానే వర్కౌట్ అయింది. హర్షవర్ధన్ కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దొరికింది. పోలీస్ పాత్రలో సునీల్ కూడా ఓకే. మిగతా వాళ్ళు తమ పరిధుల మేరకు నటించారు.

సాంకేతిక నిపుణులు:
పుష్పక విమానంకు సినిమాటోగ్రఫీ టాప్ లెవెల్లో ఉందని చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. రామ్ మిర్యాల ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది. ఈ చిత్రానికి ప్రధాన బలం స్క్రీన్ ప్లే. ఎడిటింగ్ బాగుంది. ఇక దర్శకుడు దామోదర విషయానికి వస్తే డీసెంట్ గానే హ్యాండిల్ చేసాడు.

చివరిగా: పుష్పక విమానం చిత్రం డీసెంట్ ఫన్ తో అక్కడా ఇక్కడా థ్రిల్స్ తో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ ప్లస్ కాగా సెకండ్ హాఫ్ డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది.

రేటింగ్ : 2.75/5

ఇవి కూడా చదవండి:

పుష్పక విమానం టైటిల్ పర్మిషన్ సింగీతంను అడిగితే…

పుష్పక విమానం ట్రైలర్: ఆసక్తికర కాన్సెప్ట్ తో నవ్వుల పూవులు

నవంబర్ 12న థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న “పుష్పక విమానం”

`పుష్ప‌క విమానం` నుంచి ఫ‌స్ట్ లిరిక‌ల్‌!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All