Homeన్యూస్పుష్పక విమానం టైటిల్ పర్మిషన్ సింగీతంను అడిగితే...

పుష్పక విమానం టైటిల్ పర్మిషన్ సింగీతంను అడిగితే…

పుష్పక విమానం టైటిల్ పర్మిషన్ సింగీతంను అడిగితే...
పుష్పక విమానం టైటిల్ పర్మిషన్ సింగీతంను అడిగితే…

ఆనాటి కాలంలో సూపర్ డూపర్ హిట్ అయిన మేటి చిత్రాల టైటిల్స్ ను ఈనాటి కాలంలో వాడుకోవడం అన్నది పరిపాటిగా మారుతూ వస్తోంది. ఇదేం ఇప్పుడు మొదలైన ట్రెండ్ కాదు, గతంలో కూడా చాలా జరిగాయి. అయితే అలా పాత క్లాసిక్ టైటిల్స్ ను వాడుకుంటున్నప్పుడు పర్మిషన్ తీసుకునేవారు ఎంత మంది? అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది.

రీసెంట్ గా విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన చిత్రం పుష్పక విమానం. రేపు ఈ చిత్రం విడుదలవుతోంది. దామోదర అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని విజయ్ స్వయంగా నిర్మించాడు. లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు పుష్పక విమానం అనే మాటల్లేని చిత్రాన్ని తీసి క్లాసికల్ హిట్ ను సాధించిన విషయం తెల్సిందే. మరి ఆ టైటిల్ ను ఆనంద్ సినిమాకు వాడుకున్నప్పుడు సింగీతం పర్మిషన్ తీసుకున్నారా అన్న ప్రశ్నకు..

- Advertisement -

ఆనంద్ జవాబు ఇస్తూ, “మేము నిజానికి సింగీతం గారికి ఫోన్ చేసాం. ఇలా మీ టైటిల్ వాడుకోవచ్చా అని అడిగాం. దానికి ఆయన ఇదేం నేను సృష్టించిన పదం కాదు. నేను కూడా ఇతిహాసాల్లోంచి తీసుకున్నదే. నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అని తెలిపాడు” అని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా ప్రోమోస్ ఆసక్తికరంగా ఉన్నాయి.

Also Read:

ఆదిత్య 369 సీక్వెల్ తో బాలయ్య ప్యాన్ ఇండియా ప్లాన్

88 ఏళ్ల నవ యవ్వనుడి సినిమా దర్శకత్వం

పుష్పక విమానం ట్రైలర్: ఆసక్తికర కాన్సెప్ట్ తో నవ్వుల పూవులు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All