Homeన్యూస్పుష్ప ది రైజ్ సెకండ్ సింగిల్: శ్రీవల్లి డేట్ ఖరారు

పుష్ప ది రైజ్ సెకండ్ సింగిల్: శ్రీవల్లి డేట్ ఖరారు

పుష్ప ది రైజ్ సెకండ్ సింగిల్: శ్రీవల్లి డేట్ ఖరారు
పుష్ప ది రైజ్ సెకండ్ సింగిల్: శ్రీవల్లి డేట్ ఖరారు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప. ఎర్రచందనం నేపథ్యంలో శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా కనిపించనుండగా హీరోయిన్ గా చేస్తోన్న రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రను చేస్తోంది. శ్రీవల్లి ఫస్ట్ లుక్ ను ఇటీవలే విడుదల చేసారు. ఇక ఇప్పుడు పుష్ప సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

పుష్ప నుండి విడుదలైన మొదటి పాట దాక్కో దాక్కో మేకకు ఎంత స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో మనందరం చూసాం. ఇక సెకండ్ సింగిల్ శ్రీవల్లిను అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పుష్ప మొత్తం ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. సెకండ్ సింగిల్ ను కూడా మొదటి సింగిల్ లాగానే ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

- Advertisement -

డిసెంబర్ 17న పుష్ప విడుదలవుతుందని ఇప్పటికే వెల్లడించిన విషయం తెల్సిందే. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All