Homeటాప్ స్టోరీస్రిలీజ్ డేట్ ను లాక్ చేసిన పుష్ప

రిలీజ్ డేట్ ను లాక్ చేసిన పుష్ప

రిలీజ్ డేట్ ను లాక్ చేసిన పుష్ప
రిలీజ్ డేట్ ను లాక్ చేసిన పుష్ప

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. పుష్ప క్రిస్మస్ కు వస్తుందని టీమ్ అధికారికంగా ఇదివరకే తెలియజేసారు. ఇక ఇప్పుడేమో చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డిసెంబర్ 17న పుష్పను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారు.

పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న విడుదల చేయగా సెకండ్ పార్ట్ ను 2022లో కానీ 2023లో కానీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ పోషిస్తున్నాడు.

- Advertisement -

సుకుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. శేషాచలం అడవుల బ్యాక్ డ్రాప్ లో నిర్మిస్తోన్న ఈ సినిమా ఎర్ర చందనం కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. పుష్పలో ఇప్పటికే దాక్కో దాక్కో మేక పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. సెకండ్ సింగిల్ ను కూడా త్వరలోనే విడుదల చేస్తారని అధికారికంగా తెలియజేసారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All