Homeన్యూస్పుష్ప రాజ్ భామ లుక్ ను రివీల్ చేయనున్న టీమ్

పుష్ప రాజ్ భామ లుక్ ను రివీల్ చేయనున్న టీమ్

పుష్ప రాజ్ భామ లుక్ ను రివీల్ చేయనున్న టీమ్
పుష్ప రాజ్ భామ లుక్ ను రివీల్ చేయనున్న టీమ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ పుష్ప షూటింగ్ శరవేగంగా సాగుతోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి చిత్రం పుష్ప ది రైజ్ డిసెంబర్ లో క్రిస్మస్ సీజన్ కు వస్తుందని అధికారికంగా తెలిపారు. అయితే ఈ డేట్ లో మార్పు ఉంటుందని కూడా అంటున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అది పక్కన పెడితే పుష్ప ప్రమోషన్స్ పరంగా యాక్టివ్ గానే ఉంది. మొదటి సింగిల్ దాక్కో దాక్కో మేకకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ లో సెకండ్ సింగిల్ వస్తుందన్నారు కానీ అది జరగలేదు. అయితే సెకండ్ పాటకు సంబంధించి త్వరలోనే అప్డేట్ వస్తుందని తెలిపారు.

- Advertisement -

ఇదిలా ఉంటే పుష్ప టీమ్ ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. రేపు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు రష్మిక మందన్న ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All