
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నేషన్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అల వైకుంఠపురములో సాంగ్స్ ఎంతగా పాపులర్ అయ్యాయో మనం చూసాం. ప్రస్తుతం పుష్ప ది రైజ్ చిత్ర షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్న షేర్షా చిత్రానికి రివ్యూ ఇచ్చాడు అల్లు అర్జున్. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెయిర్ గా నటించిన ఈ చిత్రం కార్గిల్ హీరో విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కింది. విష్ణువర్ధన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా కరణ్ జోహార్ నిర్మించాడు. అమెజాన్ లో అత్యధికంగా చూసిన చిత్రంగా నిలిచిన షేర్షాను హార్ట్ టచింగ్ ఫిల్మ్ అన్నాడు బన్నీ.
“షేర్షా టీమ్ కు నా అభినందనలు. సిద్ధార్థ్ మల్హోత్రా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ఇది. కియారా అద్వానీ సెటిల్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు కూడా అదరగొట్టారు. ముఖ్యంగా దర్శకుడు విష్ణువర్ధన్ కన్విక్షన్ అద్భుతం. కరణ్ జోహార్ కు కంగ్రాట్యులేషన్స్” అని ట్వీట్ చేసాడు అల్లు అర్జున్.
Congratulations to the entire team of #Shershaah. A very heart touching film . Career best performance by Mr. @SidMalhotra . Man who stole the show . Subtle & impactful performance by Ms @advani_kiara and all the other actors . My respect to all the technicians of the film .
— Allu Arjun (@alluarjun) September 1, 2021