
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్ గా కాకా హోటల్ వద్ద ఆగి టిఫిన్ తిని బయటకు వస్తోన్న వీడియో వైరల్ అయిన విషయం తెల్సిందే. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ వారాంతం వరకూ పుష్ప షూటింగ్ అక్కడే జరుగుతుందని సమాచారం.
క్రిస్మస్ కు పుష్ప ది రైజ్ ను విడుదల చేయాలన్నది దర్శకుడు సుకుమార్ ప్లాన్. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఎలాగైనా దీపావళి నాటికి పుష్ప మొదటి పార్ట్ షూటింగ్ ను పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం అల్లు అర్జున్, సుకుమార్ ఓవర్ టైమ్ కష్టపడుతున్నారని సమాచారం.
పుష్ప ఫస్ట్ సాంగ్ దాక్కో దాక్కో మేక సూపర్ హిట్ తర్వాత ఈ నెల మరో సాంగ్ ను విడుదల చేయాలని ప్లాన్ చేసారు నిర్మాతలు. అయితే ఇందుకు సంబంధించిన ప్రకటన ఇంకా రాలేదు. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ పుష్ప చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.