Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్న ప్రియదర్శి

అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్న ప్రియదర్శి

Priyadarshi tweet on Allu Arjun
Priyadarshi tweet on Allu Arjun

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ , బ్రోచేవారెవరురా చిత్రాలు చూసి వాటిని ప్రమోట్ చేస్తున్నారు బాగానే ఉంది నా సినిమా కూడా చూడండన్నా ! ప్రమోట్ చేయండి మల్లేశం తప్పకుండా మీకు నచ్చుతుంది అంటూ అల్లు అర్జున్ ని ప్రశ్నిస్తున్నాడు హాస్య నటుడు ప్రియదర్శి . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో పాటుగా బ్రోచేవారెవరురా చిత్రాలను చూసి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే .

మల్లేశం చిత్రానికి కూడా విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి అయితే సినిమా బాగుందని టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం పెద్దగా లేవు దాంతో సినిమా బాగున్నా దాదాపుగా కిల్ అవుతోంది . ఆ బాధ ప్రియదర్శి లో ఉంది అందుకే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో మల్లేశం చిత్రాన్ని చూసి నాలుగు మంచి మాటలు చెబితే కొంత ప్రయోజనం ఉంటుంది అన్నది అతడి ఆలోచన . మరి అల్లు అర్జున్ మల్లేశం చిత్రాన్ని చూస్తాడా ? ప్రమోట్ చేస్తాడా ? చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All