
చింతకింది మల్లేశం జీవిత కథతో తెరకెక్కిన మల్లేశం చిత్రాన్ని చూసాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . ఈనెల 21 న విడుదలకు సిద్దమైన మల్లేశం చిత్రానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించటానికి నావంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు . చేనేత నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మల్లేశం గా హాస్య నటుడు ప్రియదర్శి నటించాడు .
చేనేత కార్మికుల నైపుణ్యానికి పెద్ద పీట వేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించారని అలాగే మంచి డైలాగ్స్ ఉన్నాయని మల్లేశం పాత్రలో ప్రియదర్శి అద్భుతంగా నటించాడని కొనియాడాడు కేటీఆర్ . చేనేత కార్మికులకు అండగా నిలవడానికి ప్రతీ సోమవారం చేనేత వస్త్రాలనే ధరించాలని యువతకు పిలుపునిచ్చాడు కేటీఆర్ . రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మల్లేశం చిత్రం ఈనెల 21న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల కానుంది .