Homeన్యూస్చివరి దశకు చేరుకున్న ఆది పురుష్ షూటింగ్

చివరి దశకు చేరుకున్న ఆది పురుష్ షూటింగ్

చివరి దశకు చేరుకున్న ఆది పురుష్ షూటింగ్
చివరి దశకు చేరుకున్న ఆది పురుష్ షూటింగ్

ప్యాన్ ఇండియన్ స్టార్ గా అవతరించిన ప్రభాస్ ఇప్పుడు ఆది పురుష్, సలార్ షూటింగ్స్ మధ్య జగ్లింగ్ చేస్తోన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆది పురుష్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. నవంబర్ చివరి నాటికి ఆది పురుష్ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఈ చిత్రం కోసం ప్రభాస్ 70 రోజుల కాల్ షీట్స్ ను కేటాయించాడు. ఈ సినిమాలో రాముడిగా కనిపించనున్నాడు.

ఆది పురుష్ ను పూర్తి చేసాక సలార్ కు బల్క్ డేట్స్ ను కేటాయించనున్నాడు ప్రభాస్. ఆది పురుష్ ఆగస్ట్ 11, 2022న విడుదల కానుంది. షూటింగ్ నవంబర్ ఎండ్ కు పూర్తయినా కానీ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా సమయం తీసుకుంటుంది. విశేషంగా విఎఫ్ఎక్స్ వాడకం ఉంటుందని తెలుస్తోంది. అందుకోసమే దర్శకుడు ఓం రౌత్ షూటింగ్ ను పూర్తి చేసి దాదాపు ఆరు నెలలకు పైగా పోస్ట్ ప్రొడక్షన్ కోసం కేటాయించాడు.

- Advertisement -

కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రను పోషిస్తోంది. అలాగే లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటించాడు. ఆది పురుష్, సలార్ కాకుండా ప్రభాస్ మరో రెండు సినిమాలను కూడా ప్రకటించాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలు చేయనున్నాడు ప్రభాస్. ఇవన్నీ కూడా ప్యాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All