Homeన్యూస్ప్రభాస్ సలార్ లో కన్ఫర్మ్ అయిన మరో భామ

ప్రభాస్ సలార్ లో కన్ఫర్మ్ అయిన మరో భామ

ప్రభాస్ సలార్ లో కన్ఫర్మ్ అయిన మరో భామ
ప్రభాస్ సలార్ లో కన్ఫర్మ్ అయిన మరో భామ

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. ప్రభాస్ అటు ఆది పురుష్ ఇటు సలార్ షూటింగ్స్ ను మ్యానేజ్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న సలార్ ఈ ఏడాది చివరికి మొత్తం షూటింగ్ ను కంప్లీట్ చేసుకోనుందని తెలుస్తోంది.

సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోందన్న విషయం తెల్సిందే. ఇప్పుడు మరో భామను కూడా ఫైనలైజ్ చేసారు. మీనాక్షి చౌదరి సలార్ లో సెకండ్ హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది. రవితేజ ఖిలాడీలో కూడా హీరోయిన్ గా చేస్తోన్న మీనాక్షికు ఆఫర్లు పెరుగుతున్నాయి.

- Advertisement -

కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెల్సిందే. కేజిఎఫ్ చాప్టర్ 2 ఏప్రిల్ లో విడుదల కానున్న నేపథ్యంలో సలార్ విడుదల వాయిదా పడనుంది. వచ్చే ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కేజిఎఫ్ చాప్టర్ 2 ను నిర్మించిన హోంబేలె ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. సలార్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All