Homeటాప్ స్టోరీస్ప్రభాస్ సలార్ కోసం హాలీవుడ్ టెక్నాలజీ..!

ప్రభాస్ సలార్ కోసం హాలీవుడ్ టెక్నాలజీ..!

Hollywood Technology for Prabhas Salaar

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కె.జి.ఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కె.జి.ఎఫ్ నిర్మించిన హోంబలే ఫిలింస్ బ్యానర్ లోనే ఈ సినిమా వస్తుంది. కోల్ మైన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమాలో ప్రభాస్ ను నెక్స్ట్ లెవల్ లో చూపిస్తున్నాడు ప్రశాంత్ నీల్. అంతేకాదు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ వేరే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

అందుకే సలార్ సినిమా కోసం హాలీవుడ్ టెక్నాలజీని వాడుతున్నట్టు తెలుస్తుంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో వాడే డార్క్ సెంట్రిక్ థీం టెక్నాలజీని సలార్ సినిమా కోసం వాడుతున్నట్టు తెలుస్తుంది. క్రేజీ హాలీవుడ్ మూవీస్ బ్యాట్ మెన్ ట్రియాలజీ, టెనెట్, మ్యాట్రిక్ సినిమాలను ఈ టెక్నాలజీతోనే షూట్ చేయడం జరిగింది. ప్రభాస్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ దార్క్ సెంట్రిక్ థీం టెక్నాలజీతో యాక్షన్ సీన్స్ షూట్ చేయబోతున్నారు.

సలార్ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ కూడా పనిచేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం కె.జి.ఎఫ్ చాప్టర్ 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఆ సినిమాతో పాటుగా సలార్ సినిమా షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సలార్ రెండు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All