Homeన్యూస్పూనమ్ కౌర్ మద్దతు ఆ ప్యానెల్ కే!

పూనమ్ కౌర్ మద్దతు ఆ ప్యానెల్ కే!

పూనమ్ కౌర్ మద్దతు ఆ ప్యానెల్ కే!
పూనమ్ కౌర్ మద్దతు ఆ ప్యానెల్ కే!

నటి పూనమ్ కౌర్ చేసిన సినిమాలు తక్కువే. దాని ద్వారా వచ్చిన పాపులారిటీ కూడా తక్కువే. అయితే అమ్మడు ఇటీవలే తన ట్వీట్స్ తో, మాటలతో ఎక్కువగా ఫేమస్ అయింది. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన విషయాల్లో పూనమ్ కౌర్ పేరు కూడా ఎక్కువగా లాగుతుంటారు. ఇదిలా ఉంటే పూనమ్ కౌర్ రీసెంట్ గా ఒక ట్వీట్ చేసింది. అది ప్రాధాన్యత సంతరించుకుంది.

మా ఎలెక్షన్స్ హడావిడి ఓ రేంజ్ లో ఉన్న సంగతి తెల్సిందే. పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఇద్దరూ కూడా మా ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. ఇదిలా ఉంటే పూనమ్ కౌర్ తన మద్దతు ప్రకాష్ రాజ్ కే అని రివీల్ చేసింది. ప్రకాష్ రాజ్ మా ప్రెసిడెంట్ అయితే తనకు న్యాయం జరుగుతుందని ఆమె అంది.

- Advertisement -

ప్రకాష్ రాజ్ తో దిగిన ఫోటోను షేర్ చేసిన పూనమ్ కౌర్, “ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు మద్దతు పలుకుతున్నాను. ప్రకాష్ రాజ్ చిల్లర రాజకీయాలు చేయరు కాబట్టి నాకు న్యాయం జరుగుతుంది అనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ కనుక ప్రెసిడెంట్ అయితే ఎప్పటినుండో ఉన్న నా సమస్యలను అతని ముందు ఉంచుతాను. ఆయన అయితేనే న్యాయం చేయగలరు” అని ట్వీట్ చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All