Homeటాప్ స్టోరీస్పడిపడి లేచె మనసు రివ్యూ

పడిపడి లేచె మనసు రివ్యూ

Padi Padi Leche Manasu Movie Reviewపడిపడి లేచె మనసు రివ్యూ :
నటీనటులు : శర్వానంద్ , సాయి పల్లవి
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
నిర్మాతలు : ప్రసాద్ చుక్కపల్లి – సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం : హను రాఘవపూడి
రేటింగ్ : 3. 25 / 5
రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2018

వరుస విజయాలతో మంచి జోరుమీదున్నశర్వానంద్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”పడిపడి లేచె మనసు ” . ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది .ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :

కోల్ కతా లో మెడికల్ అయిన వైశాలి ( సాయి పల్లవి ) ని పిచ్చిగా ప్రేమిస్తాడు సూర్య ( శర్వానంద్ ) . వైశాలి కూడా సూర్య ని అంతే ఇష్టంగా ప్రేమిస్తుంది . అయితే ఇద్దరం ప్రేమించుకుందాం , ఇలా కలిసి ఉందాం కానీ పెళ్లి మాత్రం వద్దు అని అంటాడు సూర్య . దాంతో అతడికి దూరం అవుతుంది వైశాలి . పిచ్చిగా ప్రేమించిన వైశాలి దూరం కావడంతో తీవ్రంగా బాధపడతాడు సూర్య . అయితే మళ్ళీ సూర్య – వైశాలి కలుసుకున్నారా ? తిరిగి ఒక్కటయ్యారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

శర్వానంద్
సాయి పల్లవి
హను డైరెక్షన్
పాటలు
విజువల్స్

డ్రా బ్యాక్స్ :

స్లో నేరేషన్
ఎడిటింగ్

 

నటీనటుల ప్రతిభ :

ఈ సినిమాకు ఆయువుపట్టు సూర్య – వైశాలి పాత్రలు , ఆ పాత్రల్లో శర్వానంద్ – సాయి పల్లవి జీవించి ప్రేక్షకుల మన్ననలను పొందారు .
ప్రేమికుడిగా , భగ్న ప్రేమికుడిగా అద్భుతమైన వేరియేషన్స్ పలికించాడు శర్వా . సాయి పల్లవి క్యారెక్టర్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . వైశాలి పాత్రలో సాయి పల్లవిని తప్ప మరొకరిని ఊహించలేం . ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది . ఇక మిగిలిన పాత్రల్లో సునీల్ , వెన్నెల కిషోర్ , ప్రియదర్శి , మురళీశర్మ , ప్రియా రామన్ తదితరులు తమతమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు .

సాంకేతిక వర్గం :

హను రాఘవపూడి దర్శకుడిగా మరోసారి మెరిపించాడు .మాములు కథ అయినప్పటికీ , కథనం ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ మేజిక్ క్రియేట్ చేసాడు . అద్భుతమైన విజువల్స్ తో , తనదైన మార్క్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . ఫస్టాఫ్ ని చాలా బాగా హ్యాండిల్ చేసిన దర్శకుడు ఇంటర్వెల్ ని కన్విన్సింగ్ గా తీయలేకపోయాడు . ఇక సెకండాఫ్ లో కూడా కొంత తడబడ్డాడు అయితే మొత్తానికి శర్వా పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసాడు . విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి . విశాల్ స్వరపరిచిన అన్ని పాటలు కూడా దేనికదే ప్రాధాన్యతని సంతరించుకున్నాయి . జేకే విజువల్స్ కూడా ఈ సినిమాకు మరో హైలెట్ అనే చెప్పాలి . కోల్ కతా అందాలను మరింత అందంగా తన కెమెరాలో బంధించాడు . ప్రసాద్ – సుధాకర్ ల నిర్మాణ విలువలు బాగున్నాయి .

ఓవరాల్ గా :

యూత్ ని అలరించే పడిపడి లేచె మనసు

English Title: Padi Padi Leche Manasu Movie Review

Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All