HomeVideosపాగల్ ట్రైలర్: రొమాంటిక్, ఎనర్జిటిక్, ఫన్నీ

పాగల్ ట్రైలర్: రొమాంటిక్, ఎనర్జిటిక్, ఫన్నీ

పాగల్ ట్రైలర్: రొమాంటిక్, ఎనర్జిటిక్, ఫన్నీ
పాగల్ ట్రైలర్: రొమాంటిక్, ఎనర్జిటిక్, ఫన్నీ

మాస్ కా దాస్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు రొమాంటిక్ హీరోగా మారిపోయాడు. ఈ హీరో నటిస్తోన్న రొమాంటిక్ డ్రామా పాగల్ ఈ నెల 14న విడుదల కానుంది. నరేష్ కుప్పిలి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించగా అగ్ర నిర్మాత దిల్ రాజు దీన్ని సమర్పిస్తున్నాడు.

ఇక ఈరోజు పాగల్ ట్రైలర్ విడుదలైంది. సిటీలో కనిపించే ప్రతీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పే యువకుడిగా విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు. ఏకంగా 1600 మందికి ఐ లవ్ యూ చెప్పినట్లు తెలుపుతాడు. అయితే నిజమైన ప్రేమను వెతికే క్రమంలో విశ్వక్ కు నివేతా పేతురాజ్ పరిచయమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ, విశ్వక్ సేన్ ఎమోషనల్ కనెక్ట్ ఈ ట్రైలర్ ను ఆసక్తికరంగా మార్చాయి. సెకండ్ హాఫ్ లో కథ ఎమోషనల్ టర్న్ తీసుకునే అవకాశముంది.

- Advertisement -

ముఖ్యంగా కథ రొటీన్ గా ఉన్నా కానీ ట్రీట్మెంట్ ఎంటర్టైనింగ్ గా ఉంది. మరి ఈ 14న పాగల్ గా మారిన విశ్వక్ సేన్ ఏం చేస్తాడో చూడాలి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All