Homeటాప్ స్టోరీస్అక్టోబర్ 31 లేడీస్ నైట్ ను మొదలుపెట్టిన విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్

అక్టోబర్ 31 లేడీస్ నైట్ ను మొదలుపెట్టిన విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్

అక్టోబర్ 31 లేడీస్ నైట్ ను మొదలుపెట్టిన విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్
అక్టోబర్ 31 లేడీస్ నైట్ ను మొదలుపెట్టిన విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్ సింగ్ మొత్తానికి డిజిటల్ డెబ్యూ చేస్తోంది. ఇప్పటికే కాజల్ అగర్వాల్, తమన్నా, సమంత డిజిటల్ డెబ్యూ చేసిన విషయం తెల్సిందే. ఈ కోవలోకే రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. అక్టోబర్ 31 లేడీస్ నైట్ టైటిల్ తో తెరకెక్కుతోన్న వెబ్ షో లో రకుల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇందులో విశ్వక్ సేన్ కామియో పాత్రలో నటిస్తున్నాడు.

ఒక రోజు హాలోవీన్ పార్టీలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ వెబ్ షో ఉంటుందని తెలుస్తోంది. నిన్నటి నుండి ఈ వెబ్ ఫిల్మ్ షూట్ మొదలైంది. రకుల్ ప్రీత్ తో పాటు మేఘా ఆకాష్, నివేతా పేతురాజ్, విద్యుల్లేఖ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ ది పెళ్లి కొడుకు పాత్ర అని తెలుస్తోంది.

- Advertisement -

విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్, విద్యులు ప్రస్తుతం షూట్ లో పాల్గొంటున్నారు. త్వరలోనే ఒక బడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈ వెబ్ ఫిల్మ్ విడుదల కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All