Homeటాప్ స్టోరీస్మళ్ళీ మహానటి సావిత్రిగా కీర్తి సురేష్

మళ్ళీ మహానటి సావిత్రిగా కీర్తి సురేష్

once again keerthi suresh as mahanati savitriఇప్పటికే మహానటి చిత్రంలో సావిత్రిగా నటించి మెప్పించింది కీర్తి సురేష్ కాగా మళ్ళీ మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ నటించడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో ” ఎన్టీఆర్ ” బయోపిక్ చేస్తున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్ సినిమా అనగానే మహానటి సావిత్రి పాత్ర తప్పకుండా ఉంటుంది పైగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి కాబట్టి సావిత్రి పాత్ర తప్పనిసరి అయ్యింది . ఇంకేముంది సావిత్రి పాత్రలో ఇంకా ఎవరినో తీసుకునే బదులు కీర్తి సురేష్ నే నటించమని కోరారట దర్శకులు క్రిష్ .

మహానటి చిత్రంలో నటించి ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందింది కీర్తి సురేష్ , కాగా ఆమె పాత్రనే మరోసారి పోషించే అదృష్టం రావడంతో మరో మాట లేకుండా ఒప్పేసుకుందట ! ఇక అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రలో మనవడు సుమంత్ నటించనున్నాడు . జులై 5 నుండి ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది అయితే మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పాత్రని నెగెటివ్ షేడ్ లో చూపించబోతున్నారని కోర్టు నోటీసులు పంపారు . అది ఇంకా క్లియర్ కాలేదు మరి , బాలయ్య నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా విద్యా బాలన్ ఎన్టీఆర్ భార్య గా నటించనుంది . అన్ని అడ్డంకులు తొలగితే 2019 జనవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts