Homeటాప్ స్టోరీస్విడాకులు తీసుకుంటున్న దర్శకులు క్రిష్

విడాకులు తీసుకుంటున్న దర్శకులు క్రిష్

director krish going to take divorceదర్శకులు క్రిష్ తన భార్య కు విడాకులు ఇవ్వనున్నట్లు సమాచారం . 2016 లో డాక్టర్ రమ్య ని పెళ్లి చేసుకున్నాడు క్రిష్ . అయితే ఈ రెండేళ్ల కాలంలో ఇద్దరి మధ్య అనుబంధం మరింత దృఢం కావాల్సింది పోయి అంతరం పెరగడంతో ఇద్దరం కలిసి ఉండలేమనే నిర్ణయానికి వచ్చారట ! దాంతో పరస్పర అవగాహనతో విడాకులకు అప్లై చేసినట్లు ప్రచారం జరుగుతోంది . అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడానికి గల కారణాలు మాత్రం వెలుగులోకి రాలేదు కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఇద్దరి దారులు , ఆలోచనలు వేరుగా ఉన్నాయట దాంతో రెండు భిన్న ధృవాలు ఒకే ఒరలో ఇమడటం కష్టం కాబట్టి విడిపోవడమే బెటర్ అని భావించారట .

విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా క్రిష్ కు పేరుంది . ఇప్పటివరకు చేసిన అన్ని చిత్రాలు కూడా దేనికదే విభిన్నమైనది కావడం విశేషం . బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి వంటి సూపర్ హిట్ చిత్రాన్నీ అందించిన క్రిష్ తాజాగా ప్రతిష్టాత్మక చిత్రమైన ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకత్వం వహించడానికి సంసిద్ధం అవుతున్నాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All