Homeన్యూస్'అంటే సుందరానికి' అప్డేట్ చాల వెరైటీగా ఉందే..

‘అంటే సుందరానికి’ అప్డేట్ చాల వెరైటీగా ఉందే..

'అంటే సుందరానికి' అప్డేట్ చాల వెరైటీగా ఉందే..
‘అంటే సుందరానికి’ అప్డేట్ చాల వెరైటీగా ఉందే..

శ్యామ్ సింగరాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని..ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో అంటే సుందరానికి అనే మూవీ చేస్తున్నాడు. బ్రోచేవారేవరురా సినిమాతో హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ ఈ మూవీ లో నాని ని డిఫరెంట్ గా చూపించబోతున్నాడు. ఇందులో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్‏గా నటిస్తోంది.

ఇక రీసెంట్ గా చిత్ర యూనిట్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ను ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఈ ఒక్కటే కాదు చిత్ర ప్రమోషన్ ను అన్ని సినిమాల్లాగా కాకుండా చాల కొత్తగా చేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇక నాని బర్త్ డే (ఫిబ్రవరి 24) సందర్భంగా చాల వెరైటీగా ప్రమోట్ చేసారు. బర్త్ డే హోమం అంటూ వెరైటీగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

- Advertisement -

అంటే… మా యువ సుందరుడి పుట్టిన రోజు సందర్భంగా మేము జరుపుతున్న ఒక ‘Barthhday Homam’ ఫిబ్రవరి 23న సా||గం 4:05 ని||ల నుండి మొదలు ?అందరూ ఆహ్వానితులే ! అంటూ తెలిపారు. ఈ పోస్టర్ లో నాని ఎంతో అమాయకంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని.. వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All