Homeటాప్ స్టోరీస్గడ్డం పెంచిన నాని..కారణం అదేనా..?

గడ్డం పెంచిన నాని..కారణం అదేనా..?

గడ్డం పెంచిన నాని..కారణం అదేనా..?
గడ్డం పెంచిన నాని..కారణం అదేనా..?

శ్యామ్ సింగ రాయ్ మూవీ తో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని..త్వరలో అంటే సుందరానికి మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ లో మలయాళ నటి నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది.మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని మే 6న రిలీజ్ చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడం తో వెంటనే మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు నాని.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘దసరా’ మూవీ లో నటిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇటీవలే ఈ మూవీ ఓపెనింగ్ కార్య క్రమాలు పూర్తి చేసుకుంది.

- Advertisement -

రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఈ మూవీ కోసం నాని తన లుక్ ను మార్చుకునే పనిలో ఉన్నాడు. తాజాగా బయటకు వచ్చిన నాని లేటెస్ట్ స్టిల్ చూస్తుంటే ఈ మూవీ లో నాని గడ్డం తో కనిపించబోతున్నట్లు అర్ధమవుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలంగాణ నేపథ్యంలో సాగనుంది. ఇందులో హీరో నాని తెలంగాణ యువకుడిగా కనిపించనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All