Homeన్యూస్వైష్ణవ్ తో కలిసి నాగబాబు తెగ కష్టపడుతున్నాడు

వైష్ణవ్ తో కలిసి నాగబాబు తెగ కష్టపడుతున్నాడు

వైష్ణవ్ తో కలిసి నాగబాబు తెగ కష్టపడుతున్నాడు
వైష్ణవ్ తో కలిసి నాగబాబు తెగ కష్టపడుతున్నాడు

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య బాగా సన్నగా అయ్యాడు. ఒకప్పటి నాగబాబు కు..ఇప్పటి నాగబాబు కు చాల  డిఫరెంట్ ఉంది. సడెన్ గా ఎంతగా సన్నపడడానికి కారణం ఆయన జిమ్ లో పడుతున్న కష్టమే. ఒంట్లోని కొవ్వును అంత తగ్గించేందుకు చెమటలు చిందిస్తున్నారు.

తాజాగా తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తున్న వీడియో ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. నా మేనల్లుడిలో నాకు జిమ్ మేట్ కనిపించాడు.. నా శరీరాకృతిని మార్చుకునేందుకు నాకు సరైన పార్ట్నర్ దొరికాడు అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో ఇద్దరూ కలిసి పోటాపోటీగా డంబెల్స్ ఎత్తేస్తున్నారు. మరి నాగబాబు ఇంతలా కష్టపడడానికి వెనుక ఏదైనా రహస్యం ఉందా..అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇక నాగబాబు గత కొంతకాలం వరకు జబర్దస్త్ షో కు జడ్జ్ గా వ్యహరించారు. ఆ తర్వాత మల్లెమల్ల నుండి బయటకు వచ్చి అదిరింది, బొమ్మ అదిరింది షో లకు జడ్జ్ గా చేసారు. కానీ ఈ షోస్ పెద్దగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం కామెడీ స్టార్స్‌ షోలోకి వచ్చాడు. కామెడీ స్టార్స్ ధమాకా అంటూ షోలో పలు మార్పులు చేర్పులు చేశారు. అందులో నాగబాబు జడ్జ్‌గా చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All