
ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ నుండి వస్తోన్న రెండో సినిమా కొండ పొలం. ఒక నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు క్రిష్ తెలిపాడు. గొర్రెల కాపరి నుండి అడవిలో సంపాదించుకున్న అనుభవాల ద్వారా ఒక యువకుడు ఫారెస్ట్ ఆఫీసర్ ఎలా అయ్యాడనేది ఈ చిత్ర కథ. సినిమా మొత్తం అడవిలోనే జరుగుతుంది. రేపు విడుదల కానున్న ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలను మీడియాతో పంచుకున్నాడు వైష్ణవ్ తేజ్.
“క్రిష్ ఈ కథతో నా వద్దకు వచ్చినప్పుడు చాలా ఆసక్తి కలిగింది. ఇలాంటి కథను నేనెప్పుడూ వినలేదు. ముందుగా పవన్ కళ్యాణ్ కు థాంక్స్ చెప్పుకోవాలి, క్రిష్ ను ఈ చిత్రం చేయడానికి ఓకే చెప్పినందుకు. క్రిష్ లాంటి అనుభవజ్ఞుడితో పనిచేయడం నాకు చాలా ప్లస్ అయింది. నా రోల్ చాలా ఛాలెంజింగ్. అయితే దర్శకుడు నా నుండి కోరుకుంది డెలివర్ చేశాననే అనుకుంటున్నాను.
ఈ చిత్రం కోసం గొర్రెలను కాయాల్సి వచ్చింది. ముందుగా గొర్రెలు మాట వినకుండా అటూ ఇటూ వెళ్లిపోయేవి, కానీ మేము ఒక ట్రిక్ ను ఫాలో అయ్యి షూట్ చేసాం. అలాగే పులికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం నాకు మరో విజయాన్ని అందిస్తుంది” అని నమ్మకంగా చెప్పాడు వైష్ణవ్.