Homeన్యూస్లక్ష్య రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన నిర్మాతలు!

లక్ష్య రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన నిర్మాతలు!

లక్ష్య రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన నిర్మాతలు!
లక్ష్య రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన నిర్మాతలు!

నాగ శౌర్య హీరోగా విడుదలైన రీసెంట్ సినిమా వరుడు కావలెను మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న విషయం తెల్సిందే. దీని తర్వాత నాగ శౌర్య చేసిన సినిమా లక్ష్య. శౌర్యకి ఉన్న పర్సనల్ ఇష్యూల కారణంగా ఈ చిత్ర విడుదల వాయిదా పడుతుందని భావించారు కానీ ఇప్పుడు నిర్మాతలు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేసారు. లక్షను డిసెంబర్ 10న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ చిత్రంలో నాగ శౌర్య ఆర్చర్ గా కనిపిస్తాడు. ఈ సినిమా కోసమే శౌర్య తన బాడీని బాగా కష్టపెట్టాడు. ఎయిట్ ప్యాక్ యాబ్స్ తో మజిల్ బాడీతో అదిరిపోయాడు. హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చేశాడు. లక్ష్య సినిమాపై అంచనాలు భారీగానే పెట్టుకున్నాడు శౌర్య. గత కొంత కాలంగా సరైన హిట్ లేని నేపథ్యంలో లక్ష్య తన కెరీర్ ను పూర్తిగా మారుస్తుందని నమ్ముతున్నాడు.

- Advertisement -

సంతోష్ జాగర్లపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రొమాంటిక్ సినిమా ద్వారా డెబ్యూ చేసిన కేతిక శర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కాల భైరవ ఈ సినిమాకు సంగీతం అందించాడు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావ్, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒకట్రెండు రోజుల్లో ప్రమోషన్స్ షురూ అవుతాయి.

ప్లాప్ దర్శకుడితో ముందుకెళ్లనున్న ప్లాప్ హీరో

నాగ శౌర్య రేంజ్ ను మార్చగలిగే చిత్రమిదే!

పెళ్లి చూపులు పిల్ల.. ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

నాగశౌర్య కు జరిమానా 

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All