Homeటాప్ స్టోరీస్బ్రేకింగ్ : హీరో నాగ శౌర్య తండ్రి అరెస్ట్..!

బ్రేకింగ్ : హీరో నాగ శౌర్య తండ్రి అరెస్ట్..!

Hero Naga Shaurya Father Arrested
 

రీసెంట్ గా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో గల మంచి రేవులలో గల నాగ శౌర్య ఫ్యామిలీకి సంబందించిన ఫాం హౌజ్ లో పేకాట ఆడుతున్న కొందరిని పోలీసులు అదుపులో తీసుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో భాగంగా పోలీసుల విచారణ అనంతరం హీరో నాగ శౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా శివలింగ ప్రసాద్ కు నోటీసులు జారీ చేసినా ఆయన పట్టించుకోలేదని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా ఆయన ఫాం హౌజ్ లో పేకాట ఆడుతూ కొందరు దొరకడంతో ఈసారి ఆయన్ను అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నారు.

అయితే ఈ పేకాట కేసులో ప్రధాన నిందితుడిగా గుత్తా సుమన్ పేరు వినపడుతుంది. ఆయనతో పాటు మరో వ్యక్తి ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో కీల నిందితుడు శివ లింగ ప్రసాద్ ను పేకాట దందాలో కూడా ఆయనకు పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.

- Advertisement -

హీరో నాగ శౌర్య సొంత ప్రొడక్షన్ కూడా నడుపుతున్నాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో నాగ శౌర్య సొంత సినిమాలు చేస్తున్నాడు. అయితే తండ్రి అరెస్ట్ యువ హీరో కెరియర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో లేదో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All