Homeన్యూస్ప్యాచ్ వర్క్ సన్నివేశాల్లో బిజీగా థాంక్యూ

ప్యాచ్ వర్క్ సన్నివేశాల్లో బిజీగా థాంక్యూ

ప్యాచ్ వర్క్ సన్నివేశాల్లో బిజీగా థాంక్యూ
ప్యాచ్ వర్క్ సన్నివేశాల్లో బిజీగా థాంక్యూ

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా థాంక్యూ. ఇటీవలే లవ్ స్టోరీ చిత్రంతో సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించాడు నాగ చైతన్య. ఇదే ఊపులో ఇప్పుడు థాంక్యూ చిత్రాన్ని రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే మెజారిటీ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇక కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు మిగిలున్నాయి. త్వరలోనే ఈ చిత్ర టీమ్ 3 రోజుల షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్లనున్నారు.

అది పూర్తయ్యాక మైసూర్ లో మరో చిన్న షెడ్యూల్ ఉంది. అందులో ప్యాచ్ వర్క్ సన్నివేశాలు షూట్ చేస్తారు. ఈ షెడ్యూల్ థాంక్యూ చిత్రం పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి ఫిబ్రవరి లేదా మార్చ్ లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాశి ఖన్నా, నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అవికా గోర్, మాళవిక నాయర్ లు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య మహేష్ బాబు అభిమానిగా కనిపిస్తాడు. థాంక్యూ మరిన్ని విశేషాలు త్వరలో తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All